పిఠాపురం(ADITYA9NEWS): కాపురానికి తీసుకెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్న భర్తపై భార్య నిరసన గళం వినిపించింది. ఏకంగా అతడు పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి కాపురానికి తీసుకెళ్లే వరకూ కదిలేదంటూ అక్కడే బైఠాయించింది. ..
వివరాల్లోకివెళితే …

తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన నందీశ్వరితో గొల్లప్రోలుకు చెందిన పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తునన మురాలశెట్టి అచ్చిరాజుతో 5 ఏళ్లక్రితం వివాహాం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కాగా, మొదట కాన్పులో పుట్టిన బాబు చనిపోయాడు. తరువాత పాప జన్మించింది. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సమస్య మొదలైంది. అయితే తనను కాపురానికి కావాలనే తీసుకెళ్లడం లేదని, ఆడపిల్ల పుట్టిందని వేధిస్తున్నాడని నందీశ్వరి ఆరోపించింది. అతడు పనిచేస్తున్న పిఠాపురం మున్సిపల్ కార్యాలయానికి వచ్చి భర్తను నిలదీసింది. ఎంతకీ అతడు స్పందించకపోవడంతో అక్కడే బైఠాయించింది. కొంత సేపటికి పిఠాపురం పట్టణ ఎస్సై శంకర్రావు వచ్చి ఆమెను సముదాయించారు. అనంతరం గొల్లప్రోలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు.