కామ్రేడ్ భద్రన్న  ( దళ నాయకుడు ) భౌతిక‌కాయం పై ఎర్రజెండా కప్పి నివాళులర్పించిన న్యూడెమోక్రసీ నాయకత్వం

ఈసం భద్రన్న కు విప్లవ జోహార్లు

కామ్రేడ్ భద్రన్న  ( దళ నాయకుడు ) భౌతిక‌కాయం పై ఎర్రజెండా కప్పి నివాళులర్పించిన న్యూడెమోక్రసీ నాయకత్వం
ఇల్లందు / జై తెలంగాణ న్యూస్


పోరుబాటలో పేద ప్రజల కోసం నిర్బంధాలను అక్రమ కేసులను లెక్కచేయకుండా ఉద్యమాల్లో ముందు నడిచిన కామ్రేడ్ ఈసం భద్రన్న మరణం విప్లవోధ్యమానికి లోటని సీపిఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు అన్నారు. శనివారం మాణిక్యారంలో భద్రన్న భౌతిక దేహంపై ఎర్ర జెండా కప్పి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కామ్రేడ్ భద్రన్న సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ అజ్ఞాత దళాల్లో ఎంతో చురుగ్గా సుదీర్ఘ కాలం పనిచేసాడని ఈక్రమంలో ఎన్నో నిర్బంధాలను,అక్రమ కేసులను,కష్టాలను ఎదిరించి నిలిచాడని కొనియాడారు. కామ్రేడ్

ఈసం భద్రన్న నేడు మనకు భౌతికంగా దూరం కావడం విచారకరమని అన్నారు. ఈ ప్రాంతంలో పేదల కష్టాల్లో తోడుగా ఉంటూ భూమి,భుక్తి కోసం,రహదారులు,పక్కా గృహాలు,విద్యా, వైద్యం, సాగునీరు, తాగునీరు తదితర ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగిన పోరాటాల్లో ఈసం భద్రన్న పాత్ర మరువలేమన్నారు. కామ్రేడ్ ఈసం భద్రన్న మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ ఆర్సి నాయకులు ఎం.యాకన్న, మండల కార్యదర్శి పొడుగు నర్సింహరావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోడేటి నాగేశ్వరరావు, కొక్కు సారంగపాణి, బోయ తండా సర్పంచ్ సంతు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :