వాటర్‌ ట్యాంక్‌లో శవం, అదే నీళ్లను పది రోజులుగా తాగుతున్న ప్రజలు

వాటర్‌ ట్యాంక్‌లో శవం, అదే నీళ్లను పది రోజులుగా తాగుతున్న ప్రజలు

నల్గొండ జిల్లా: నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం చోటు చేసుకుంది.

నల్లగొండ మున్సిపాలిటీ లోని 28వ వార్డు, హనుమాన్ నగర్ కు చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్ (26) గత నెల 24వ తేదీ నుండి కనిపించకుండా పోయాడు

అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెతకడం ప్రారంభించారు. ఈరోజు ఉదయం పట్టణం లో 12వ వార్డులో గల హిందూపూర్ వాటర్ ట్యాంకులో వంశీకృష్ణ యాదవ్ శవమై కనిపించాడు.

అను మానాప్పద స్థితిలో మృతదేహం లభించడంతో స్థానికంగా కలకలం రేపింది. వాటర్ ట్యాంకులో వాటర్ చెక్ చేయగా అందులో డెడ్ బాడీ ప్రత్యక్షమైంది.

వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు. మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యంవల్ల పది రోజులుగా అ వార్డు ప్రజలు ఆ నీటిని తాగే పరిస్థితి ఏర్పడింది…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :