వందనం లో ఘనంగా బక్రీదు వేడుకలు

వందనం లో ఘనంగా బక్రీదు వేడుకలు

సామూహిక -బక్రీదు పండుగ ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు..

ఇస్లాం ప్రపంచ శాంతిని కోరుతుంది…. షేక్ పాషా 

కాంగ్రెస్ మైనారిటీ మండల ప్రెసిడెంట్ 

 

జై తెలంగాణ న్యూస్_ చింతకాని

బక్రీద్ పండుగ పురస్కరించుకొని చింతకాని మండలం వంధనం గ్రామంలో ఈద్గా వద్ద సోమవారం ముస్లిం సోదరులు ఈదుల్ ఆజ్ హా(బక్రీద్) పండుగ నమాజు నిర్వహించారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ ఇస్లాం ప్రపంచ శాంతిని సోదర భావం కోరుకుంటుందన్నారు. బక్రీద్ పండుగ వేళ పేద ముస్లింలకు పేదలకు కుర్బానీ మాంసాన్ని అందించి వారు కూడా పండుగలో సంతోషంగా పాల్గొనేలా ప్రతి ఒక్కరు సహకరించి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. వర్షాలు లేకుండా అల్లాడుతున్న సమస్త కోటికి వర్షాన్ని కురిపించాలని ఈ సందర్భంగా అల్లాహ్ ను వేడుకుంటూ ప్రార్థనలు పూర్తి చేశారు. అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆ లింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, ముస్లిం యువకులు, ఉప సర్పంచ్ ( మాజీ ) షేక్ ఖాధీర్ బాబా, కాంగ్రెస్ గ్రామ నాయకులు షేక్ మోయిన్, ముజావర్ మైబు, షేక్ జహూర్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :