హైదరాబాద్(ADITYA9NEWS): సినీ నటుడు రామ్‌చరణ్‌కు కరోనా సోకింది. ఆయన కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు రామ్‌చరణ్ స్వయంగ ట్వీట్ చేశారు. అయితే కోవిడ్‌కు సంబంధించి ఎటువంటి లక్షణాలు లేవని, ఆరోగ్యం బాగానే ఉందని చరణ్ స్పష్టం చేశారు. వైద్యుల సూచనల మేరకు హొంక్వారంటైన్‌లో ఉంటానని తెలిపారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య స్థితిని తెలియజేస్తానని చెప్పారు. కొద్ది రోజుల క్రితం చిరంజీవికి కరోనా పాజిటివ్ రాగా, కొద్దిరోజుల్లోనే ఆయన కరోనాను జయించిన విషయం పాఠకులకు విధితమే.
