ముఖ్య‌వార్త‌లు సంక్షిప్తంగా(ఏపీ/తెలంగాణ)

* సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.కొత్త ఏడాదిలో అందరూ శాంతి- సౌఖ్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

* తెలుగు రాష్ట్రాల్లో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లను తెలుగువారంతా ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు. కోటి ఆశ‌ల‌తో 2021 ఏడాదికి స్వాగ‌తం ప‌లికారు.

* వ్య‌క్తి గ‌త ఐటీ రిట‌ర్న్‌ల గ‌డువును ఆర్థిక శాఖ జ‌న‌వ‌రి 10వ తేది వ‌ర‌కూ పెంచింది.

* భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోవిడ్-19 నుంచి కోలుకున్నారు.
త‌న కుటుంబ స‌భ్యులు క‌రోనాను జ‌యించార‌ని న‌డ్డా తెలిపారు.

* కేంద్ర ఎన్నిక‌ల సంఘం కృష్ణ, గుంటూరు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరు
నమోదు ప్రక్రియను జనవరి 18 వరకు పొడిగించింది.

* ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. క‌ర్నూలు రాజ‌కీయాల్లో చ‌ల్లాకు మంచిపేరుంది.

* ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈఓగా లెఫ్టినెంట్ కమాండర్ రవీంద్రనాథ్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :