అంత‌ర్వేది తీరానికి భారీ చేప‌

అంత‌ర్వేది,(ADITYA9NEWS): తూర్పుగోదావ‌రి జిల్లా అంత‌ర్వేది తీరానికి ఓభారీ చేప కొట్టుకొచ్చింది. ఇది బ‌హుశ తిమంగ‌ళ‌మై ఉంటుంద‌ని అక్క‌డ మ‌త్స్యాకారులు చెబుతున్నారు. అన్నా-చెల్లెలు గ‌ట్టుకు స‌మీపంలో ఈచేప కొట్టుకు రావ‌డంతో స్థానిక మ‌త్స్య‌కారులు పెద్ద ఎత్తున చేరుకుని దానిని పూర్తిగా ప‌రిశీలిచారు.

 

 

సుమారు 20 ట‌న్నుల బ‌రువు ఉండే ఆచేప‌ను చూసేందుకు యువ‌తి, యువ‌కులు పెద్ద ఎత్తున స‌ముద్ర‌తీరానికి వ‌స్తున్నారు. ఇంత‌టి పెద్ద చేప‌ను ఎప్పుడూ చూడ‌లేదని మ‌త్స్యాకారులు చెప్పుకొచ్చారు. కొట్టుకొచ్చిన భారీ చేప మృతి చెంది ఉండ‌టంతో దుర్వాస‌న వెద‌జ‌ల్లుతుంది. స‌ముద్రంలో ఆయిల్ సంస్థ‌లు జ‌రుపుతున్న స‌ర్వేలో భాగంగా యంత్రాలు ఏమైనా త‌గిలి భారీ చేప చ‌నిపోయి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :