రాజమండ్రి నుండి యానాంకు చేరిన ఆషాడం సారె..
యానాం,(ADITYA9NEWS): ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 10 మేకపోతులు, అబ్బురపరిచే మధురమైన 30 రకాల స్వీట్లు, కోళ్లు, చేపలు అక్కడితో ఆగలేదు. ఇంకెన్నో ఆడపిల్లకు పెట్టాల్సినవన్ని పంపించారు. యానాంలో జరిగిన సారె హడావుడి చూసి ఆశ్చర్యపోయారు స్థానికులు.
యానాంలో ఓ మోటారు సైకిల్ షోరూం యజమాని తోట రాజు కుమారుడు పవన్‌కుమార్‌కు ఇటవలే రాజమండ్రికి చెందిన వ్యాపారవేత్త బత్తుల రామకృష్ణ కుమార్తె ప్రత్యూషాదేవికి వివాహం జరిగింది. ప్రస్తుతం ఆషాడ మాసం కావడంతో కొత్తగా పెళ్లైన అమ్మాయి ఇంటి నుండి అత్తవారింటికి సారె పంపించడం గోదావరి జిల్లాల్లో ఆనవాయితీ. ఈకోవలో రాజమండ్రి నుండి యానాంకు భారీ సారె పంపించారు అమ్మాయి తల్లిదండ్రులు.
వారు పంపిన సారెలో ఏకంగా 10 మేకపోతులు, 50 కోళ్లు, టన్ను చొప్పన కొరమేను,పండుగప్ప, బొచ్చే చేప,250 కిలోల బొమ్మిడాయిలు, 250 కిలోల కిరాణాతోపాటు, ఆడపిల్లలకు పెట్టాల్సిన సరంజామా మొత్తాన్ని పెద్ద ఎత్తున పంపించి అందర్ని ఆశ్చర్యపరిచారు. వియ్యంకుడి పంపిన సారెను తోట రాజు వారి బంధువులకు పంచాడు.