ఇన్సైడర్ ట్రేడింగ్ వాదనలపై రాష్ట్రప్రభుత్వానికి ఎదురుదెబ్బ
అమరావతి,(ADITYA9NEWS): ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్ పై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం కింద కొనుగోలుదారుకు వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
ప్రభుత్వ వాదనలతో డిఫెన్స్ లాయర్లు విభేదించారు. రాజధాని అమరావతి విషయంలో అక్రమాలు జరిగాయని ఎవరూ ఫిర్యాదు చేయనప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఏముందన్నారు. ఇదే అంశాన్ని గతంలో హైకోర్టు అన్నీ పరిశీలించే తీర్పు ఇచ్చిందని వారు సుప్రీంకు నివేదించారు. ఇరువురి వాదనల అనంతరం పిటిషన్ను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.