మహబూబాబాద్ క్రైం విభాగం
మార్చి 27 జై తెలంగాణ న్యూస్
మహబూబాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. మహబాబూబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్లు (1300 కిలోల) పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల తీసుకొచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారని పోలీసు అధికారులు వివరించారు.1300 కిలోల పేలుడు పదార్థాల్లో 6400 పవర్ జలిటిన్ స్టిక్స్ 180 పవర్ బూస్టర్ జిలెటిన్ స్టిక్స్ 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు ఉన్నాయి.