అదే విధంగా టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారాన్ని చిలకలూరిపేటలో ప్రారంభించిన నరేంద్ర మోడీ జగన్ మీద విమర్శలు చేయకుండానే వెళ్ళిపోయారు
మోడీ దేశానికి ప్రధాని. జగన్ ఏపీకి ముఖ్యమంత్రి. ఈ ఇద్దరి మధ్య ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సారధులుగా ఉన్న సంబంధ బాధవ్యాలే తప్ప అంతకు మించి ఏమీ లేదు అని రెండు పార్టీల నేతలూ చెబుతూ ఉంటారు. కానీ చూడబోతే అంతకు మించి బంధమే ఉందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే రాజకీయాలు ముదిగి పాకాన పడి ఎన్నికల వేడి పుట్టుకుని వచ్చాక మోడీ పార్టీ అయిన బీజేపీ కూటమిలో ఉంటూ ప్రత్యర్ధిగా ఎదురు వచ్చినా సీఎం జగన్ ఒక్క మాట అనడంలేదు
అదే విధంగా టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారాన్ని చిలకలూరిపేటలో ప్రారంభించిన నరేంద్ర మోడీ జగన్ మీద విమర్శలు చేయకుండానే వెళ్ళిపోయారు. జగన్ మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అని ఒక ఆరోపణ చేశారు. వ…
తెలుగు రాష్ట్రాల్లో మోడీ ప్రభావం ఎంత… కొత్త సర్వే ఫలితాలు ఇవే!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. తెలంగాణలో ఎలాగు లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ సమయంలో లోక్ సభ ఎన్నికలపై ప్రముఖ మీడియా సంస్థ ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికరమైన ఫలితాలు తెరపైకి వచ్చాయి.
అవును… లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మార్చి 13 నుంచి 27 వరకూ ప్రముఖ మీడియా సంస్థ ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తాజా సామాజిక, రాజకీయ అంశాలపైనా.. ప్రజల్లో చర్చలో ఉన్న సంఘటనలపైనా ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు. అయితే… ఈ ఆన్ లైన్ సర్వేలో కాంగ్రెస్ పాలిత తెలంగాణలోనూ, వైసీపీ పాలిత ఏపీలో కూడా మోడీకి అనుకూల అభిప్రాయాలూ వెలువడ్డాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా… పౌరసత్వ సవరణ చట్టం, ప్రధాని పదవికి అర్హత, రామమందిర నిర్మాణం, అవినీతిని అరికట్టడం, ధరల పెరుగుదల, మణిపూర్, నిరుద్యోగం మొదలైన అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు. వీటికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం…!!
పౌరసత్వ సవరణ చట్టం: మోడీ ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చిన ఈ సీఏఏ.. బీజేపీకి కలిసిరానుందని ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 54.03 శాతం తెలుగు ప్రజలు అభిప్రాయపడగా.. 15.25 మంది బీజేపీకి కలిసి రాదని.. 30.72 శాంతంమంది ఎలాంటి ప్రభావం చూపదని అభిప్రాయపడ్డారట! ప్రధానిగా ఎవరైతే బెటర్?: మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని, మోడీని మూడోసారి ప్రధాని అవ్వాలని బీజేపీ భావిస్తుండగా… మోడీకి ఇదే లాస్ట్ అవకాశం అవ్వాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తుంది! ఈ సమయంలో… ఈ సర్వేలో పాల్గొన్న తెలుగువారిలో 79.31 శాతం మంది మోడీనే మరోసారి ప్రధాని అవ్వాలని కోరగా.. 15.52 శాతం మంది రాహుల్ గాంధీ.. 3.45 శాతంమంది మల్లిఖార్జున ఖర్గే.. 1.72 శాంతం మంది నితీష్ కుమార్ లు ప్రధానులు అయితే బెటర్ అని అభిప్రాయపడ్డారట.
మోడీ వర్సెస్ ఇండియా కూటమి: ఇక, విపక్ష ఇండియా కూటమి.. ప్రధాని మోడీ హవాను తట్టుకుని నిలబడలేదని 73.80శాతం మంది తెలుగువాళ్లు అభిప్రాయపడగా.. ఇండియా కూటమికి మద్దతుగా 17.34శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక 8.86శాతం మంది ఏమీ చెప్పలేమి చెప్పారట! హామీలను నెరవేర్చడం!: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలోనూ మోడీ ప్రభుత్వం ముందుందని ఈ సర్వేలో తేలినట్లు చెబుతున్నరు. ఇందులో భాగంగా మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని 60.62 శాతం మంది తెలపగా.. 26.20 శాతం మంది నెరవేర్చలేదని.. 12.18శాతం మంది ఏమీ చెప్పలేమని అభిప్రాయపడ్డారంట.
అవినీతిని అరికట్టడం: ఇక అవినీతిని అరికట్టే విషయంలో కూడా మోడీ సర్కార్ సఫలమైందని 47.21 శాతం మంది అంగీకరించగా.. 38.66 శాతం మంది అవినీతిని అరికట్టలేదని.. 14.03 శాతం మంది ఏమీ చెప్పలేమని చెప్పారంట. అయోధ్య రామమందిరం!: ఈ సమయంలో మోడీ సర్కార్ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పుకుంటున్న రామమంద్రిరం హామీ నెరవేర్చడం పై కూడా 30.83 శాంతం మంది తెలుగువాళ్లు సదాభిప్రాయాన్ని కలిగి ఉన్నారై ఈ సర్వే చెబుతుంది! ఇదే సమయంలో… మోడీ పాలనలో ధరల పెరుగుదల అతిపెద్ద పరాజయం అని 37.64 శాతం మంది పేర్కొనగా… నిరుద్యోగిత పై 19.39 శాతం, మణిపూర్ వివాదంపై 27.38 శాతం, ఇందన ధరలపై 15.59 శాతం మంది ది పరాజయంగా పేర్కొన్నట్లు ఈ సర్వే చెబుతుంది!