ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శిగా వెంకటేశ్
వెంకటేశ్ కు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుల అభినందనలు
జై తెలంగాణ న్యూస్ ఖమ్మం _ ఏప్రిల్ 9 2024
ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శిగా చాపల వెంకటేశ్ ఎన్నికయ్యారు. ఏప్రిల్ 5న ఖమ్మం పట్టణంలో మంచి కంటి ఫంక్షన్ హాల్ లో జరగిన ఎస్ఎఫ్ఐ 46వ జిల్లా మహాసభల్లో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు వెంకటేశ్ మంగళవారం వెల్లడించారు. జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నికున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వెంకటేశ్ కు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పోనుకుల సుధాకర్, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు నండ్ర ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగేశ్వరావు, సంగయ్య, డివైఎఫ్ఐ జక్కంపూడి కృష్ణ, మురళీ, మల్లికార్జున్, వెంకట్, పాషా, తదితరులు అభినందనలు తెలియజేశారు…