వందనం మసీద్ లో భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు
_ ప్రార్థనలో పాల్గొన్న నూర్ భాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ బడే సాహెబ్
_ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ( TJU ) ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ షేక్ యాకుబ్ పాషా
_ చింతకాని మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ (బడే) పాషా
_ మాజీ ఉపసర్పంచ్ షేక్ ఖదీర్ బాబా
జై తెలంగాణ న్యూస్ ప్రతినిధి చింతకాని / 11 ఏప్రిల్ 2024
ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో నెలరోజుల పాటు నియమనిష్టలతో గడిపిన ముస్లిం సోదరులు గురువారం (11-04-2024) రంజాన్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. స్థానికంగా ఉన్న మసీద్ కు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ( ఈద్ ముబారక్ ) శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
ఇమామ్ ముజీబుర్ రహ్మన్ … ఏ విధంగా నమాజ్ చేయాలి… ఎన్నిసార్లు నిలబడి, కూర్చొని నమాజ్ చేయాలో వివరించారు.
మసీద్ పక్కనే వున్నా నసీం ( చాచా ) ఇంటివద్ద ఆనవాయితీ ప్రకారం ముస్లిం మహిళలు భక్తిశ్రద్ధలతో నమాజ్ లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముజావార్ షేక్ మైబు, మాజీ ఉప సర్పంచ్ షేక్ ఖదీర్ బాబా,
టీడీపీ , కాంగ్రెస్, భారాసా, బీజేపీ పార్టీలా ముస్లిం కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు,స్థానికేతర ముస్లింలు, యువకులు, చిన్నారుల సైతం ప్రార్థనల్లో పాల్గొన్నారు