ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ” రెబల్” ఎంపీ అభ్యర్థిగా మద్దిశెట్టి అజయ్ బాబు
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త మద్దిశెట్టి అజయ్ బాబు
• దొరలకు, అణగారిన వర్గాల, బహుజనులకు జరిగే ఎన్నికల యుద్ధం.
• బహుజనులపై దాడులకి అక్రమ కేసులకి వ్యతిరేకంగా బహుజనభేరి మోగిస్తా
• అణగారిన వర్గాల బహుజన ప్రజానీకానికి, దొరల పాలనలో తీవ్ర అన్యాయం.
ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు అంబేద్కర్ స్ఫూర్తితో ఎన్నికల పోటీకి “” సై “” అంటున్న అజయ్ బాబు
జై తెలంగాణ న్యూస్ ప్రతినిధి
ఖమ్మం/ ఏప్రిల్ 16
ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త మద్దిశెట్టి అజయ్ బాబు మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం నుండి నామినేషన్ వేస్తున్నానని, నాకు మద్దతుగా బహుజన ముక్తి ఆల్ ఇండియా పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు అంసోల్ లక్ష్మణ్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు మట్టి ప్రసాద్ తెలుపుతున్నారని అన్నారు. అలాగే తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెక్స్ పోర్స్ రాష్ట్ర నేతలు డి. నవీన్ నాయక్, ఎస్ కే జాన్ పాషా, మహబూబాద్ పార్లమెంటు నియోజవర్గం ఎంపీ అభ్యర్థిగా కొనక రామదాసు ను ప్రకటిస్తున్నామని తెలిపారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఎన్నికలు అని మతం పేరుతో బిజెపి, ప్రాంతం పేరుతో బిఆర్ఎస్, కులం పేరుతో కాంగ్రెస్ పార్టీ లు ప్రజలను అడ్డుపెట్టుకుని మభ్యపెడుతూ ఓట్లు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఓటు ఎవరికి వేయాలో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కేవలం వెనకబడిన ప్రజల సంక్షేమం కొరకు మరియు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, రాజ్యాంగ రక్షణ కొరకు, ప్రాథమిక హక్కులను కాపాడుకొనేందుకు ఈ ఎన్నికల్లో నిలబడుతున్నామని తెలియజేశారు. మతం పేరుతో క్రైస్తవులపై, ముస్లింసులపై జరుగుతున్న దాడులు అలాగే కులం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలపై అన్ని రాజకీయ పార్టీల ధమనకాండ జరపడం హేయబద్దమన్నారు. ప్రజాస్వామ్య దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని బిజెపి, ఆర్ఎస్ఎస్ ల కుట్రను అడ్డుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కేవలం రెడ్డి వర్గం నేతలే ఆదిపత్యం చలాయించే ధోరణి తీవ్రంగా ఖండించారు. అత్యధిక మెజార్టీ ఓట్లు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులందరూ ఒకే తాటిమీద ఉండి మన ఓట్లు మనమే వేసుకుని బహుజన రాజాధికారం తెచ్చుకుని రాజ్యాంగాన్ని మారుస్తానని అన వారికి మరియు అగ్రకుల ధోరణి చూపిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎస్ యం రాష్ట్ర నేత రాజులపాటి ఐలన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రమేష్, స్టేట్ లీడర్ కూనం సూరయ్య మరియు రచ్చ సుజాత తదితరులు పాల్గొన్నారు.