జగన్‌ చీకటి పాలనకు తెరదించి చంద్రబాబును సీఎం చేసుకుందాం నందికొట్కూరు స్వర్ణాంధ్ర సాకార యాత్రలో బాలకృష్ణ

జగన్‌ చీకటి పాలనకు తెరదించి చంద్రబాబును సీఎం చేసుకుందాం

  • నందికొట్కూరు స్వర్ణాంధ్ర సాకార యాత్రలో బాలకృష్ణ

జై తెలంగాణ న్యూస్ డెస్క్ రిపోర్ట్  (నంద్యాల గ్రౌండ్ రిపోర్ట్ ) :

మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్‌ రెడ్డి అమరావతికి భూములిచ్చిన రైతులను నట్టేట ముంచారని టీడీపీ అగ్రనాయకుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం నాడు నంద్యాల జిల్లా నందికొట్కూరు పటేల్‌ సెంటర్‌లో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సభలో సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్‌ చీకటి పాలన కావాలో… చంద్రబాబు అభివృద్ధి కావాలో జనం ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. సొంత బాబాయిని హత్యచేసిన వారిని జగన్‌ కాపాడుతున్నారని మండిపడ్డారు. తల్లిని, చెల్లిని ఇంటి నుంచి జగన్‌ గెంటేశాడన్నారు. లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగుల పొట్టకొట్టారని విరుచుకుపడ్డారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌ వారికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజాసేవకే పరితపించిన దివంగత నేత ఎన్టీఆర్‌ ప్రజల గుండెల్లో దేవుడుగా నిలిచారని అన్నారు. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి ఎన్టీఆర్‌కు మానస పుత్రికలని తెలిపారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలన సాగించారని ధ్వజమెత్తారు. జగన్‌ను ఇంటికి పంపడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. శ్రీశైలం డ్యాం భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన జగన్‌.. ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే 98 జీవో బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నందికొట్కూరు అసెంబ్లీ అభ్యర్థి జయసూర్యను గెలిపించాలని నందమూరి బాలకృష్ణ కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :