SP Chief | కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీ చేసే స్ధానంపై స్పష్టత ఇచ్చింది. యూపీలోని కన్నౌజ్ నుంచి అఖిలేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీ చేసే స్ధానంపై స్పష్టత ఇచ్చింది. యూపీలోని కన్నౌజ్ నుంచి అఖిలేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి ఎంతో పట్టున్న కన్నౌజ్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ మూడు సార్లు విజయం సాధించారు.
ఇక 2012, 2014 ఎన్నికల్లో ఆయన భార్య డింపుల్ యాదవ్ గెలిచారు. అయితే 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పాథక్ చేతిలో ఆమె ఓటమి చవిచూశారు.
కాగా, కొద్ది రోజుల క్రితం ఈ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ మేనల్లుడు, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడైన మాజీ ఎంపీ తేజ్ ప్రతాప్ యాదవ్ పోటీ చేస్తారని పార్టీ వర్గాలే ప్రకటించాయి. ఇక పార్టీ నేతల ఒత్తిడి మేరకు అఖిలేశ్ పోటీలో ఉండాలని నిర్ణయించారు.