అక్కడ శిష్యుడు నెగ్గాడు…గురువు ఓడారు..మరి ఇక్కడా..?
జై తెలంగాణ న్యూస్ ( ఆంధ్ర ప్రదేశ్ కంటైట్ రైటర్ – పాషా ) ఏప్రిల్ 29
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా రెండుగా విడిపోయినప్పటికీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదాని పై ఒకటి ఎప్పుడు ప్రభావం చూపుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ ప్రభావం రెట్టింపు అయ్యే అవకాశాలే ఎక్కువ అనేది గత ఎన్నికలలో తేటతెల్లమయింది. తెలంగాణలో ప్రత్యర్థులుగా పోటీ పడుతున్న రేవంత్ – కేసీఆర్ ఇద్దరు చంద్రబాబు శిష్యులే. వారిద్దరి రాజకీయ జీవితం టీడీపీ నుండే అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి ఇద్దరు ముఖ్యమంత్రులుగా తెలంగాణ పీఠం దక్కించుకున్నవారే. అయితే ఇందులో రేవంత్ తన గురువు బాబు పైన అదే గౌరవంతో ఉంటే కేసీఆర్ మాత్రం తానూ జగన్ కు ఒక గురువుగా మారి 2019 ఎన్నికలలో బాబు ఓటమికి తనవంతు సాయం అందించారు. దీనితో జగన్ గురువు తెలంగాణ రాష్ట్రానికి అధిపతిగా మారితే ఆయన శిష్యుడు జగన్ గురువు గారి ఆశీస్సులతో ఏపీకి అధిపతిగా మారారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య అదే అంతర్గత బంధం కొనసాగిస్తూ 2023 తెలంగాణ ఎన్నికలలో ఈ బంధాన్ని మరోసారి బయటపెట్టారు. ఆ సమయంలో తన గురువు గారి కోసం జగన్ చేసిన హడావుడి కేసీఆర్ కు ప్లస్ అవ్వకపోగా మైనస్ గా మారింది. తానూ ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నప్పటికీ తన శిష్యుడు జగన్ కు ఆ పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఏపీలో రాబోయేది జగన్ ప్రభుత్వమే అంటూ ప్రజల దృష్టిని వైసీపీ వైపు మరల్చే ప్రయత్నం చేసారు. అయితే సర్వేలన్నీ కూటమి పార్టీదే విజయం అంటూ ఢంకా భజాయిస్తుంటే కేసీఆర్ మాత్రం సర్వేలకు విరుద్ధంగా జగన్ గెలుపుకై కాంక్షిస్తున్నారు. అందుకు ఏపీ ప్రజలను కూడా ప్రభావితం చేయాలనీ చూస్తున్నారు. అయితే తన సొంత రాష్ట్రంలో ఎం జరుగుతుందో తెలుసుకోలేని కేసీఆర్ తన ఓటమిని గ్రహించలేని కేసీఆర్ ఇప్పుడు వైసీపీ గెలుపుని ఉహించగలగడం నిజంగా హాస్యాస్పదం అంటున్నారు టీడీపీ శ్రేణులు. అక్కడ శిష్యుడు నెగ్గి…గురువు ఓడారు..మరి ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అందుకు భిన్నంగా గురువు నెగ్గి… శిష్యుడు ఓడేలా ఉన్నాడు అంటూ సర్వే సంస్థలు తేల్చేస్తున్నాయి.