కలెక్టరేట్‌లో వినతులు స్వీకరణ
కాకినాడ, (ADITYA9NEWS) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలినాళ్లలో పెట్టిన స్పందన కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. కరోనా సమయంలో స్పందన కార్యక్రమాలను నిలుపుదల చేశారు. కొద్ది రోజుల కిందట సీఎమ్‌వో కార్యాలయం నుండి ఆదేశాలు రావడంతో స్పందన తూర్పుగోదావరి జిల్లాలో ఇన్‌ఛార్జి కలెక్టర్ లక్ష్మీశా ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో సిహెచ్. సత్తిబాబు లు ప్రజల నుండి వచ్చిన వినతులు స్వీకరించారు.