తిరువంతపురం,(ADITYA9NEWS):
కరోనా మహ్మహరి కేరళ రాష్టాన్ని మరింత భయపెడుతోంది. కరోనా ఎఫెక్ట్ ఇప్పట్లో వదిలేలా కనిపించడంలేదు.కేసులు ఎప్పటికప్పుడు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, కేరళలో మాత్రం అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మొత్తంమీద దాదాపుగా అన్ని వ్యాపారాలపై కరోనా ప్రభావం తీవ్రంగానేపడింది.
ఈ రోజు(31న) కూడా కేరళలో అత్యధికంగా 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 33.50 లక్షలకు చేరింది. ఇక గడచిన 24 గంటల్లో కేరళలో కరోనాతో 124 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 16,1851 కి చేరింది.
రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రేపు, ఆగస్టు ఒకటవ తేదీన సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.