*దిశ* ద‌శ‌లా మహిళ‌లకు ర‌క్ష‌ణ

*తూ.గో. జిల్లా ఎస్పీ ర‌వీంద్ర‌నాధ్‌బాబు
*జిల్లాలో 10 ల‌క్షల మందికి దిశ యాప్ డౌన్‌లోడ్ ల‌క్ష్యం

పిఠాపురం,  (ADITYA9NEWS): మ‌హిళ‌ల భ‌ద్ర‌తే ల‌క్ష్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలీసుశాఖ ప‌నిచేస్తోంద‌ని, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మ‌హిళ‌ల భ‌ద్ర‌త విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌టం లేద‌ని తూర్పుగోదావ‌రి జిల్లా ఎస్పీ ర‌వీంధ్ర‌నాథ్ బాబు అన్నారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో చేప‌డుతున్న దిశ యాప్ , దిశా చ‌ట్టంపై అవ‌గాహ‌న స‌ద‌స్సును పిఠాపురంలో రెడ్డి రాజా క‌ళ్యాణ మండ‌పంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా వ‌చ్చిన ఎస్పీ , మ‌హిళలు, యువ‌తులు స్మార్ట్ ఫోన్‌లో దిశా యాప్‌ను ఉప‌యోగించే విధానంపై అవ‌గాహ‌న క‌ల్పించారు.

జిల్లా వ్యాప్తంగా 10 ల‌క్ష‌ల మంది యాప్ డౌన్‌లోడ్ చేసుకునే విధంగా ల‌క్ష్యాన్ని పెట్టుకోవ‌డం జ‌రిగింద‌ని, అందులో ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగున్న‌ర ల‌క్ష‌ల మంది యాప్ డౌన్ లోడ్ చేసుకున్నార‌ని ఎస్పీ మీడియాకు తెలిపారు. ప్ర‌త్యేక క్యాంపెయిన్ ద్వారా ఒక ల‌క్ష‌ మందికి యాప్ డౌన్‌లోడు చేసుకునేలా ల‌క్ష్యం పెట్టుకుంటామ‌ని ఈసంద‌ర్బంగా పిఠాపురం ఎమ్మెల్యే దొర‌బాబు ఎస్పీకి హామీ ఇచ్చారు.

దిశ యాప్ అవ‌గాహ‌న‌లో పాల్గొన్న కాకినాడ‌ ఎంపీ గీత, దిశ చ‌ట్టం ఉప‌యోగాల‌ను వివ‌రించారు. దిశ చ‌ట్టం అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం విజ‌యవంతానికి కృషి చేసిన పిఠాపురం సిఐ వై ఆర్‌కే శ్రీనివాస్‌, ఎస్సైల‌ను అభినందించారు. కాకినాడ డీఎస్పీలు భీమారావు, ముర‌ళీమోహ‌న్ త‌దిత‌రులు ఎస్పీతోపాటు పాల్గొన్నారు.కార్య‌క్ర‌మం అనంత‌రం పిఠాపురం ఎమ్మెల్యే దొర‌బాబు ఎస్పీని ఘ‌నంగా స‌త్క‌రించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :