జాతీయ ర‌హ‌దారిపై రోడ్డు ప్ర‌మాదం

* వ‌న్నెపూడి వ‌ద్ద సంఘ‌ట‌న‌..ఏలేశ్వ‌రానికి చెందిన ఇద్ద‌రు మృతి

గొల్ల‌ప్రోలు,(ADITYA9NEWS): తూర్పుగోదావ‌రి జిల్లా గొల్ల‌ప్రోలు మండ‌లం వ‌న్నెపూడి జాతీయ ర‌హ‌దారిపై జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి చెందారు. మోటారుసైకిల్‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు ఏలేశ్వ‌రం వైపు వెళుతుండ‌గా ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. జాతీయ‌ర‌హాదారిపై ఉన్న డివైడ‌ర్‌ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన‌ట్టుగా అక్క‌డ ప్ర‌మాదం జ‌రిగిన తీరును బ‌ట్టి పోలీసులు చెబుతున్నారు.

తుని స‌మీపంలోని త‌లుపుల‌మ్మ ఆల‌యం నుండి తిరుగు ప్ర‌యాణంలో ఏలేశ్వ‌రం వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. మృతి చెందిన ఇద్ద‌రు ఏలేశ్వ‌రం వైసీపీ కార్య‌క‌ర్త‌లుగా నిర్థారించారు. మృతుల్లో 45 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న గండ్రేడ్డి మాధ‌వ‌రావు, 55 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల సిర‌గ‌మం వెంక‌ట‌ర‌మ‌ణ‌లుగా పోలీసులు గుర్తించారు. పిఠాపురం సిఐ వై ఆర్ కే శ్రీనివాస్ సంఘట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించి, మృత‌దేహాల‌ను పోస్టు మార్టం నిమిత్తం త‌ర‌లించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :