గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊరట.
అమరావతి, (ADITY9NEWS ) : రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు డిపార్టుమెంటల్ మినహా ఏ పరీక్షలూ నిర్వహించేది లేదని, గ్రామ/వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ మంగళవారం వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఎవరూ ప్రొబేషన్ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని అజయ్ జైన్ తెలిపారు.
APPSC ద్వారా నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలు మినహా ఎలాంటి పరీక్షలు ఉండబోవన్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. CBAS కానీ ఏ ఇతర అదనపు పరీక్షలు కానీ ఉద్యోగులకు నిర్వహించరని చెప్పారు. 2019 అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఏర్పాటు చేశారని అప్పటి నుంచి రెండేళ్లు పూర్తి చేసుకున్న 1.34 లక్షల మంది ఉద్యోగులంతా కేవలం డిపార్టుమెంటల్ పరీక్షలు పాసైతే చాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ స్పష్టం చేశారు.