CNN ఛానల్ ఛైర్మన్ కఠిన నిర్ణయం
న్యూయార్క్,(ADITYA9NEWS): COVID-19 వైరస్ టీకాలు (వాక్సిన్) వేయించుకోకుండా ఆఫీస్ లో పనిచేయడానికి వచ్చిన ముగ్గురు ఉద్యోగులను నిర్థాక్ష్యణంగా తొలగించింది CNN. ఆసంస్థ చీఫ్ జెఫ్ జుకర్ పంపిన ఒక మెమోలో సిబ్బందికి చెప్పారు, వారు ఆఫీసుకు వచినప్పుడు టీకాలు వేయించుకొని రావడం తప్పనిసరని ముందుగానే తెలిపారు. కాని వాటిని సిబ్బంది పట్టించుకోకపోవడంతో నిర్ణయం తీసుకున్నారు.
“నేను స్పష్టంగా చెప్పాను – దీనిపై మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది” అని చెప్పిన మాటలను గుర్తు చేశారు. చాలా CNN కార్యాలయాలు ఇప్పటికే స్వచ్ఛంద ప్రాతిపదికన తెరిచి ఉన్నాయి. న్యూస్ సిబ్బందిలో మూడింట ఒక వంతు మంది తిరిగి వచ్చారని ఈ విషయాన్ని సిబ్బంది గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.