DXC టెక్నాలజీలో 261 మందికి ఉద్యోగాలు

వరంగల్ అర్బన్, : కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (KITS) వరంగల్‌లో నిర్వహించిన ఆన్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో 2021-22 బ్యాచ్‌కు చెందిన 261 మంది B.Tech ఫైనల్ ఇయర్ విద్యార్థులను DXC టెక్నాలజీ లో , ఉద్యోగులుగా నియ‌మించుకుంద‌ని, సంస్థ కెప్టెన్ వి లక్ష్మీకాంత రావు తెలిపారు.

MNC నిర్వహించిన ఆన్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో, KITS సాధించిన అత్యధిక ఎంపికలు ఇవే అని రావు అన్నారు. ఎంపికైన అభ్యర్థులు కళాశాలలోని CSE, IT, ECE, EEE, EIE, మెకానికల్ మరియు సివిల్ ఇంజనీరింగ్ శాఖలకు చెందినవారు ఉన్న‌ట్లు తెలిపారు.KITSW ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ K అశోక రెడ్డి మాట్లాడుతూ 2022 బ్యాచ్ విద్యార్థుల కోసం రాబోయే వారాల్లో అగ్రశ్రేణి IT సేవలు మరియు ఉత్పత్తి కంపెనీల ద్వారా కొన్ని ప్రత్యేకమైన ఆన్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించబడుతు న్న‌ట్లు వెల్ల‌డించారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :