సినిమా డెస్క్, (): సోషల్ మీడియా వచ్చిన తరువాత ఏలాంటి వారైనా ఏదొక్క సమయంలో బాధిలవ్వక తప్పని పరిస్థితి. విశేషం ఉన్నా, లేకపోయినా ఒక్కొక్కసారి ట్రొలింగ్స్‌తో ప్రముఖులు సైతం ముప్పతిప్పలు పడుతున్నారు. అలాంటి కోవలో స్టార్ నటి రష్మిక చేరిపోయింది.
తనపై వస్తున్న వార్తలకు, సోషల్ మీడియా ఎప్పుడోవేదికైందని రష్మిక చెబుతోంది. ఏలాంటి వార్తలొచ్చిన నాపై పంచ్‌లు పడ్డా నాకు అలవాటైపోయాయి. ఇప్పుడున్న వాతావరణంలో మనమేమి చేయలేం. ప్రజల పంచ్‌లు పడుతూనే ఉంటాయి. ఈమేరకు ఫిల్మ్ కంపానియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన మనస్సులో మాటను బయట పెట్టింది. కొత్తలో నాపై చాలా ట్రోల్స్ వచ్చేవి. అందులో కొన్ని బాధించేవి. కాలక్రమేణా అవన్ని అలవాటుగా మారపోయాయి. అని రష్మిక చెప్పింది. అయితే ఆన్‌లైన్ కొంత మంది కావాలనే దుర్వినియోగం చేయడం విచారకరం అంటూ రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.
25 ఏళ్ల వయస్సున్న నటిగా తాను ట్రోల్స్‌లతో రాక్‌గా మారానని, వాటిని పట్టించుకోనని చెప్పింది. రష్మిక “నేను తేలికగా తీసుకోగలిగే ప్రదేశంలో ఉన్నాను. నేను ట్రోల్ల్స్ వచ్చినప్పుడల్లా నవ్వుకుంటాను. చాలా మంది స్టార్స్ కూడా నాలాగే వీటన్నింటి నుండి మానసిక బలం పొందుతున్నారని, అనుకుంటున్నట్టు చెప్పిన రష్మిక, అసలు ప్రస్తుత నటీ, నటులు ట్రోల్స్‌ను పట్టించుకునే పనిలో మాత్రం లేరని తేల్చింది. అందుకు తానే ఉదాహరణ అని చెప్పుకొచ్చింది.