ఇప్పుడీ మిక్సింగ్ ఏంట్రా నాయ‌నా..!

 

ఒకే వ్యక్తికి కోవీషీల్డ్‌, కోవాగ్జిన్ మిశ్ర‌మ డోస్ ఇచ్చే య‌త్నాలు

దిల్లీ, (ADITYA9NEWS): ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే ఎందుకురా ఈ జీవితం అనేట్టు ఉంది. మొన్న‌టి వ‌ర‌కూ కోవీషీల్డ్ మంచిదా..కోవాగ్జిన్ మంచిదా..వాక్సిన్ వేసుకుంటే మంచిదా,, ఏదైనా స‌మ‌స్య వ‌స్తుందా ఇలా, ప్ర‌తీ ఒక్క‌రిని అలా అడుగుతూనే ఉన్నారు. వారి అనుమానాల‌న్ని ఒకేత్తైతే, మ‌రో ప‌క్క వాక్సిన్ వేసుకున్న త‌రువాత కూడా కోవిడ్ దాటికి త‌ట్టుకోలేక కొంద‌రు మృతి చెందారు.

తాజాగా మొన్న‌టికి మొన్న బూస్ట‌ర్ డోస్ అనే వార్త అంద‌ర్ని భ‌య‌పెట్టింది. ఇప్ప‌టికే రెండు డోసులు వేసుకున్న‌వారు మ‌ర‌లా బూస్ట‌ర్ డోసు వేసుకోవాల‌న్నారు. ఇలా రోజు..రోజుకి వాక్సిన్ వాడ‌కంపై స‌రికొత్త వార్త‌లొస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో మిక్సిడ్ వాక్సిన్ వ‌చ్చింది. మ‌ర‌లా ఈ మిక్సిడ్ వాక్సిన్ ఏంట‌నుకుంటున్నారా అదేనండి ఒక‌టి డోసు ఒక కంపెనీది, రెండో డోసు మ‌రో కంపెనీది. అంటే మొద‌టి డోసు కోవీషీల్డ్ వేసుకుంటే రెండ‌వ డోసులో కోవాగ్జిన్ వేసుకోంటే శ‌క్తీ బాగా పెరుగుతుందంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.

ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చేసిన అధ్యాయ‌నాల్లో మిక్సిడ్ వ్యాక్సిన్ ఫ‌లితాలు, సాధార‌ణ వ్యాక్సిన్ ఫ‌లితాల కంటే మెరుగ్గా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి కి మిక్సిడ్ వాక్సిన్ ఫ‌లితాలు అనుకూలంగా రావ‌డంతో ఆ దిశ‌గా అనుమ‌తులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కాకుండా ముక్కులో వేసే టీకా కూడా త్వ‌ర‌లో రాబోతుందంటున్నారు. ఇలా మ‌నిషికున్న అన్ని రంధ్రాల్లో వాక్సిన్ వేస్తే త‌ప్ప ఈక‌రోనా మ‌న‌ల్ని వీడేట‌ట్టు లేదు. ఏం చేస్తాం.. త‌ప్ప‌దుగా. బ‌త‌కాలంటే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :