రోజుకు 9 వేల టికెట్ల చొప్పున జారీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం జూలై నెలకు సంబంధించిన రూ.300/- టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది.ప్రత్యేకప్రవేశ దర్శన టికెట్లను, జూన్ 29న సోమవారం నుండి టిటిడి ఆన్‌లైన్‌లో ఉంచింది. జూలై 1వ తేదీ నుండి రోజుకు 3 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్ల ద్వారా భక్తులు ఒక రోజు ముందు ఈ టోకెన్లు పొందవచ్చు.జూలై 1న శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను జూన్ 30న తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తారు. ఆలయంలో పర్వదినాలు
జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 16న ఆణివర ఆస్థానం. జూలై 24న శ్రీ ఆండాళ్ తిరువాడిప్పూరం శాత్తుమొర, తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు.
జూలై 28న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి.జూలై 30 నుండి ఆగస్టు 1వ తేదీ వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి.