నిత్యా మీనన్ తాజాగా తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. నిజానికి తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేదని, కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ఈ విషయంలో తనకు ఓ కుటుంబ సభ్యుడిలా వ్యవహరిస్తున్నాడని పేర్కొంది. తెలుగు రీమేక్ ఓకె కాదల్ సహా దాదాపు ఐదు సినిమాల్లో నిత్యామీనన్, దుల్కర్ కలిసి నటించారు. దీంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని, చాలాసార్లు పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశాడని తెలిపింది.
అంతేకాకుండా పెళ్లి చేసుకుంటే జీవితంలో వచ్చే మార్పులను కూడా వివరించాడని, కొన్నిసార్లు అయితే దుల్కర్ అంత గొప్పగా చెబుతుంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. ప్రముఖ నటుడు మమ్ముట్టి కుమారుడైన దుల్కర్ సల్మాన్ అమల్ సుఫియాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి అమీరా సల్మాన్ అనే కూతురు ఉంది. ఇక మణిరత్నం తెరకెక్కించిన సరే కాదల్ కన్మణి ( ఓకె కాదల్ ) సినిమాలోని తారా పాత్ర తనకు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందని నటి నిత్యా మీనన్ పేర్కొన్నారు.