సెప్టెంబర్‌ 5నుంచి పాఠశాలలు ప్రారంభం

ప్రకటించిన సీఎం జగన్‌ ….. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కారణంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబరు 5వ తేదీన ప్రారంభం అవుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆగష్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు.

నాడు-నేడు పనులపై రెండు రోజులకోసారి జిల్లా కలెక్టర్లు సమీక్ష చేయాలని సూచించారు. అదేవిధంగా ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :