5 కోట్ల విరాళం – హీరో సూర్య

కరోనాని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డుమీద పడ్డారు.అందులో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా ఉన్నారు. సినిమా షూటింగ్ లు లేకపోవంతో చాలా మంది సినిమా ఆర్టిస్టులు ఆర్థిక సమస్యల ఎదురుకుంటున్నారు..

అయితే వారిని ఆదుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చారు. అయితే తాజాగా వారికీ హీరో సూర్య భారీ విరాళం ప్రకటించాడు. సినిమా ఆఫర్లు లేక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికీ రూ. 5 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టుగా వెల్లడించారు సూర్య..

డిజిటిల్ మీడియాకు తన లేటెస్ట్ సినిమా ‘ఆకాశమే హద్దురా’ విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తంలో రూ. 5 కోట్లను కరోనా కారణంగా ఆర్ధికంగా బాధపడుతున్న కుటుంబాలకు అందేలా ఏర్పాట్లు చేస్తానని సూర్య వెల్లడించారు..

ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ.. సినీ పరిశ్రమనే నమ్ముకొని చాలా కుటుంబాలు పనిచేస్తున్నాయి.కరోనా సమయంలో వారు ఉపాధి కోల్పోయి చాలా కష్టాలు పడుతున్నారు.. అందుకే వారికీ అండగా నిలవాలని అనిపించిందని సూర్య అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :