కరోనా సమయంలోనూ ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్
2017 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారిణి సౌమ్యా పాండే ఇటీవలే పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. మెటర్నటీ లీవ్ కింద ఆమెకు ఆరు నెలల పాటు సెలవు కూడా ఉంది. అయినా విధి నిర్వహణే ముఖ్యమనుకున్న ఆమె, కరోనా వంటి మహమ్మారి తాండవిస్తున్న సమయంలోనూ ప్రజల బాగు కోసం ఆలోచించింది. రోజుల బిడ్డను తీసుకుని తన కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహిస్తోంది. ఒడిలో చంటి బిడ్డను పెట్టుకుని తన బాధ్యతలు చేపడుతోంది. ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్, మోదీనగర్ లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా ఆమె పని చేస్తున్నారు. చంటి బిడ్డతో విధులు నిర్వహిస్తున్న ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె స్ఫూర్తిని కొనియాడుతూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.