పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అరెస్టు

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత ఎస్వీఎస్‌ఎన్‌ వర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఏలేరు ఆధునికీకరణ ఫేజ్‌-2 పనులు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరుతూ నాలుగు రోజుల క్రితం వర్మ పాదయాత్రకు పిలుపునిచ్చారు. కొవిడ్ నిబంధలను అనుసరిస్తూ పాదయాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులకు దరఖాస్తు చేశారు. కరోనా నిబంధనలు కారణంగా పాదయాత్రకు అనుమతిలేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ వంగ గీత ఒత్తిడి వల్లే అధికారులు పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని వర్మ ఆరోపించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :