కాకినాడ , (ADITYA9NEWS): తూర్పుగోదావరి జిల్లాలో కరోనా బాధితుల కోసం అందిస్తున్న సేవల్లో భాగంగా తమ వంతుగా సహాయం చేయడానికి దాతలు ముందుకొస్తున్నారు. కరోనా బాధితులను ఆదుకోవాలని, వారికి మరింత మెరుగైన సేవలు అందివ్వాలన్న సంకల్పంతో జిల్లా ఎస్పీ అద్నామ్నయీమ్ అస్మీని స్వయంగా కలిసి కొందరు వ్యాపార వేత్తలు విరాళాలను అందించారు.
సరళ ఫుడ్స్ అధినేత వినోద్ అగర్వాల్ రూ.5 లక్షలు, ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ కృష్ణారావు రూ.5 లక్షలు, విక్టరీ బజార్ అధినేత జి.వెంకటరెడ్డి రూ.2.5 లక్షల చొప్పన ఎస్పీకి అందజేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందించి కష్టకాలంలో సేవా గుణాన్ని చాటుకున్నారు.