సామర్లకోట, (ADITYA9NEWS): తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని బ్రౌన్‌పేట శివారు ప్రాంతంలో నివాసముంటున్న గుబ్బల భవానీ(35) అనే మహిళ అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆమె వంట చేస్తుండగా గ్యాస్ లీకై మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన సమయంలో ఆమె తప్ప ఇంట్లో ఎవరూ లేకపోవడంపై మృతిరాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దాపురం సిఐ జయ్‌కుమార్, సామర్లకోట ఎస్సై సుమంత్ లు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. అనుకోని ప్రమాదమా లేదా, ఆమె ఆత్మహత్య చేసుకుందా, మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానస్పదస్థితి మృతి కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.