టోక్యో చేరిన ఒలింపిక్ టీమ్

టోక్యో,(ADITYA9NEWS): ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 88 మందితో కూడిన తొలి ఇండియ‌న్ బ్యాచ్ ఆదివారం ఉద‌యం టోక్యో చేరుకుంది.ఈ నెల 23 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే.

ఇప్పుడు టోక్యో చేరుకున్న వాళ్ల‌లో ఆర్చ‌రీ, బ్యాడ్మింట‌న్‌, టేబుల్ టెన్నిస్‌, హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్ అథ్లెట్లు ఉన్నారు. వీళ్లంతా ఢిల్లీ నుంచి చార్ట‌ర్డ్ ఎయిరిండియా విమానంలో టోక్యో వెళ్లారు.

మొత్తం 88 మంది టీమ్‌లో 54 మంది అథ్లెట్లు కాగా.. మిగ‌తా వాళ్లంతా సిబ్బంది. జ‌పాన్‌లోని కురోబి సిటీ ప్ర‌తినిధులు వీళ్ల‌కు ఘ‌న స్వాగతం ప‌లికారు.

ఇండియ‌న్ అథ్లెట్ల‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్న బ్యాన‌ర్లు ప‌ట్టుకొని వెల్‌క‌మ్ చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్