పర్యాటకులతో బీచ్‌రోడ్డు సందడి
ట్రాఫిక్ సమస్యతో సతమతమైన పోలీసులు
ఉప్పాడ, (ADITYA9NEWS) : తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరం జనసంద్రమైంది. ఆషాడ మాసం ఆదివారం కావడం, కోవిడ్ కర్ఫ్యూ సడలింపుతో జనం యధేచ్ఛగా రోడ్డెక్కేశారు. వాతావరణం చల్లగా ఉండటంతో బీచ్‌గాలిని ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున రావడంతో ఉప్పాడ-కాకినాడ రోడ్డు కిక్కిరిసింది. రెండు వైపులా వచ్చే వాహనాలు చిక్కుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బందులు తప్పలేదు.
ఒకే రోడ్డు మార్గం కావడంతో ఇరువైపులా వచ్చే వాహనాలను నెమ్మదిగా పంపించడంతో వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పిఠాపురం సిఐ వై.ఆర్.కె.శ్రీనివాస్, కొత్తపల్లి ఎస్ ఐ అబ్దుల్ నబీలు స్వయంగా ఉప్పాడబీచ్ రోడ్డుకు వెళ్లి వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించారు. ఈసందర్భంగా మాస్క్‌లు, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన 50 మంది వాహన చోదకులకు అపరాద రుసుము విధించారు.