1647 మద్యం సీసాలు స్వాధీనం
అమలాపురం, (ADITYA9NEWS): తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండల చిన్నగాఢవిల్లి వద్ద పోలీసులు అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. ఉప్పలగుప్తం మండలం చిన్నగాఢవిల్లి వద్ద ఈమద్యం తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. ఒక కారులో రూ.1.39 లక్షలపైగా విలువైన మద్యాన్నిపట్టుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు తరలిస్తున్న 1647 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఉప్పలగుప్తం పోలీసులు. అమలాపురం సిఐ సురేష్‌బాబు, ఉప్పలగుప్తం ఎస్ఐ జి.వెంకటేశ్వరరావు , మద్యం తరలింపు వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.