*సచివాలయ ఉద్యోగులకు ముందున్న అగ్ని పరీక్ష
* ముందుగానే శిక్షణా తరగతులు ..సిలబస్‌ను సిద్దం చేసిన ప్రభుత్వం
అమరావతి, (ADITYA9NEWS): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 15004 సచివాలయాలలో 1.34 లక్షల గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యే సమయం సమీపిస్తున్న సమయంలో ఉద్యోగులకు అసలు పరీక్ష పెట్టింది.వాస్తవానికి సచివాలయాల ఉద్యోగాలు అక్టోబర్ నాటికి రెగ్యులర్ అవ్వాలి. అయితే నియమకాలు అన్ని ఒకేసారి జరగనందున అందరికి ఒకేసారి , 2022 జనవరి నుండి రెగ్యులర్ ప్రక్రియ చేపట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉద్యోగులకు సంబంధించి సర్విస్ రిజిస్ట్రార్ కూడా మొదలు పెట్టారు. జనవరి నుండి జరగబోయే పర్మినెంట్ ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తుంది. ఒక్కసారి పర్మినెంట్ అనేది జరిగితే ప్రభుత్వం ఉన్నా, లేకున్నా వారి ఉద్యోగానికి ఢోకా ఉండదు. ఇలాంటి సమయంలో మరో పరీక్ష నిబంధనను తెరపైకి తెచ్చింది జగన్ సర్కార్.
అసలు అగ్ని పరీక్ష ఇదే – 100 కి 40 రావాల్సిందే.
తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం వార్డు/ గ్రామ సచివాలయాల ఉద్యోగుల ప్రొహిబిషన్ పిరియడ్ కంప్లీట్ అవ్వగానే ఏపీపీఎస్సీ ద్వారా ఒక ప్రత్యేకమైన స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.100 మార్కులకు ఒక పరీక్ష నిర్వహించడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యారు. ఇందులో ఉద్యోగులు ఇప్పటి వరకూ నిర్వర్తించిన విధులు, బాధ్యతలు, వాటి నిర్వాహణలో ఎదుర్కొన్న సమస్యలు, ప్రభుత్వ పథకాలు వాటి నిర్వాహణ, ఉద్యోగులు ఆయా కేటగిరీలకు అనుసంధానమైన సబ్జెక్టుతో 65 మార్కులకు ఒక పరీక్ష.
సబార్టినేట్ సర్వీస్ రూల్స్, సిసిఏ, సెలవులకు సంబంధించి నియమ నిబంధనలు, ఉద్యోగి ప్రాథమిక విధులు, లీడర్ షిప్ క్వాలిటీ, డిజిటల్ సర్విస్, సాంకేతిక విద్య, ప్రజా సంబంధాలు తదితర అంశాలతో 35 మార్కులకు కలిపి పరీక్షను నిర్వహిస్తున్నారు. మొత్తం 100 మార్కులకు సంబంధించి పరీక్షలో 40 మార్కులు వస్తేనే ఉద్యోగం పర్మినెంట్ చేస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించని వారికి మరోసారి అవకాశం కల్పిస్తారు.
శిక్షణా తేదిలు ఖరారు
సచివాలయ ఉద్యోగుల పరీక్షకు ముందుగానే వీరికి సంబంధిత అంశాలపై ట్రైనింగ్ క్లాస్‌లు ఇవ్వనున్నారు. కంప్యూటర్‌పై అవగాహన, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు, కంప్యూటర్ ట్రైనింగ్, డిజిటలైజేషన్ పై ఈనెల 31 వరకూ శిక్షణ. ఉద్యోగి నియమ నిబంధనలు, సర్విస్ రూల్స్, కమ్యూనికేషన్స్ స్కిల్స్ వంటి అంశాలపై ఆగష్టు 1 నుండి 15వ తేది వరకూ శిక్షణ ఉండేలా ప్రణాళిక రూపొందించారు.