.హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ.
. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.
అమరావతి, (ADITYA9NEWS): వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 4 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడి, ఎడ తెరపు లేకుండా వానలు కురుస్తున్నాయి. తెలంగాణా మొత్తం ముసురుపట్టింది.
ఏపీలో తూర్పు గోదావరిలో ఎడతెరుపు లేకుండా వానలు కురుస్తున్నాయి. కోన సీమలో ఈప్రభావం మరింత ఎక్కువగా ఉంది. కోన సీమలో కొత్తపేట మండలంలో 21.80 మిల్లీమీటర్ల వర్షం నమోదైయ్యింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు, కృష్ణా, గుంటూరు, ఉత్తారంధ్ర లో విశాఖ, విజయనగరం జిల్లాలో వానలు కురుస్తున్నాయి.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం, మత్స్యాకారులు వేటకు వెళ్లొద్దని తెలిపింది. గ్రామాల్లో సర్పంచిలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల సిబ్బంది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. అలాగే గృహాలు, పశు ప్రాణ నష్టాలు ఏర్పడితే వెంటనే జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. నాలుగు రోజుల పాటు అధికారులందరూ అందుబాటులో ఉండాలని తెలిపింది.