వైభవంగా ముగిసిన శ్రీరామనవమి వేడుకలు
జై తెలంగాణ న్యూస్ / చింతకాని / ఏప్రిల్ 17
మధిర నియోజకవర్గం చింతకాని మండల పరిధిలోని వందనం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా ముగిశాయి. శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో విశేష పూజల అనంతరం శ్రీ సీతా రాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. మధ్యాహ్నం చైత్ర శుద్ధ నవమి శుభలగ్న మందు సీతారాముల కల్యాణాన్ని నిర్వహించి సాయంత్రం గ్రామోత్సవంలో భక్తుల ఆధ్యాత్మిక ధోరణిలో భజనలు , కీర్తనలు, స్మరించుకుంటూ ఉత్సవం నిర్వహించారు. గ్రామ ప్రజలు భక్తులు పురోహితులు వేద పండితులు తదితరులతో రామనామం వందనం గ్రామములో మార్మోగింది. . గ్రామ ప్రజలందరితో పాటు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ప్రజలు స్థానిక అధికారులు, మీడియా ప్రతినిధులు ఫలహారాలను ( ప్రసాదలను ) స్వీకరించారు. శుద్ధ జలాన్ని ఏర్పాటు చేసి ఆకలి మరియు దాహం సమస్యలు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కీలక నేత కాంగ్రెస్ నాయకులు ఆవుల నాగేశ్వరావు, మాజీ వార్డు నెంబర్ ఆవుల మల్లికార్జున్, ఇతర గ్రామ పెద్దలు ,ముఖ్యం గా వేములపల్లి హరీష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య పండుగ నిర్వహించేందుకు కృషి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ జహుర్, పొన్నం శంకర్రావు ( పెద్ద ), ఆవుల రాము, పొన్నం చిన్న శంకర్ రావు , షేక్ నాసర్ మియా,మిట్టపల్లి కొండల్ రావు, షేక్ నాగూర్ పాషా, సయ్యద్ గౌస్, ఉసికల సురేష్ ( స్టాలిన్ ) తదితర గ్రామస్తులు పాల్గొన్నారు