గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
జై తెలంగాణ న్యూస్ ( జాతీయం )
భారత్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం రేటు నిన్నటి కంటే రూ.330 తగ్గింది. ఇకపోతే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,600గా ఉంది. ఇకపోతే కిలో వెండి రూ. 84,000గా ఉంది.