ఎలాంటి అనుమతులు లేకుండానే సెల్ టవర్ నిర్మాణం
జై తెలంగాణ న్యూస్ ( వైరా )
వైరా పట్టణ పరధిలోని తల్లాడ రోడ్డులో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణ పనులు చకచకా జరుగుతూనే ఉన్నాయి. మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతుల సర్టిఫికెట్ లేకుండా, సెల్ టవర్ నిర్మించే స్థలానికి కమర్షియల్ కన్వర్షన్ చేయకుండా నిర్వాహకులు పనులు చేపడుతున్నారు. తమ ఇళ్ల మధ్య సెల్ టవర్ నిర్మించొద్దని ఆ ప్రాంత ప్రజలు మున్సిపాలిటీ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.