నర్సంపేట అసెంబ్లీ కోఆర్డినేటర్ గా ముస్తఫా
జై తెలంగాణ న్యూస్ ( డెస్క్ )
వరంగల్ పార్లమెంట్ పరిధిలోని నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఖమ్మం నగరానికి చెందిన మహ్మద్ ముస్తఫాను నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు