మోదీ నాయకత్వాన్ని బలపరచండి
– ఖమ్మం కార్పొరేటర్ సత్యనారాయణ
జై తెలంగాణ న్యూస్ ( కామేపల్లి )
దేశంలో మూడోసారి మోడీకి మద్దతు ఇవ్వాలని కామేపల్లి మండలం జాస్తిపల్లిలో సోమవారం ఖమ్మం కార్పొరేటర్ సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి మోడీ అభివృద్ధిని గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీకి మద్దతు ఇవ్వాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. సీతారాం నాయక్ పార్లమెంటుకు పంపించి మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.