మలబద్ధకం ప్రాణాంతకం కావొచ్చు తస్మాత్ జాగ్రత్తమలబద్ధకం ప్రాణాంతం కావొచ్చు తస్మాత్ జాగ్రత్త
ప్రముఖ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటిరాలజిస్ట్ డాక్టర్ ఎమ్. మణిశేఖరన్
మలద్వారం బైటికి చొచ్చుకొచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడిన యశోదాఆసుపత్రి వైద్యబృందం
ఖమ్మం – జై తెలంగాణ న్యూస్
ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటిరాలజిస్ట్ మలక్ పేట్ హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ డాక్టర్ ఎమ్. మణిశేఖరన్ మాట్లాడుతూ తీవ్రమైన మరియు దీర్ఘకాలిక మలబద్ధకం మల ద్వారానికి సంబంధించిన అనేక రకాలైన తీవ్రమైన సమస్యల్ని కలగజేయవచ్చు గుండెపోటుకార్డియాక్ అరెస్ట్ లాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు అని అన్నారు . కొన్ని పరిస్థితుల్లో కేవలం తీవ్రమైన , దీర్ఘకాలికమైన మలబద్ధకం వల్ల తలెత్తే ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యలవల్ల రోగి ప్రాణం పోయే పరిస్థితికూడా తలెత్తచ్చు నడుము వీత్తి కడుపు జననాంగం ప్రాంతాల్లో పట్టేసినట్టుగా ఉండడం నొప్పి కలగడం మల విసర్జన సమయంలో తీవ్రమైన అసౌకర్యం కలగడం , నొప్పి కలగడం మలబద్ధకం సాధారణమైన లక్షణాలు . మలబద్ధకానికి సకాలంలో సరైన పరిష్కారం కనుగొనకపోతే మలంలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియా విషపదార్థాలు తిరిగి రక్తంలోకి చేరే ప్రమాదం ఉంటుందని తెలిపారు దానివల్ల సెప్టిసిమియా అనే శరీరం మొత్తం ఇన్ ఫెక్షన్ వ్యాపించి విషతుల్యమయ్యే పరిస్థితి తలెత్తవచ్చు . మలద్వారం టైటికి చొచ్చుకురావడం , వాయడం , విపరీతంగా రక్తం , చీము కారడం , మూత్ర విసర్జన స్తంభించిపోవడం లాంటి ప్రమాదకరమైన పరిస్థితులకు మలబద్ధకం దారి తీయవచ్చు . ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో రోగిని వెంటనే ఆసుపత్రిలో చేర్చి ఆగమేఘాల మీద శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి కూడా రావొచ్చని అన్నారు . ఒక్కోసారి ఇలాంటి పరిస్థితి ప్రాణాంతకం కూడా కావచ్చు . మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్లు తరచూ గట్టిగా , పిట్టం కట్టినట్టుగా ఉండే మలాన్ని విసర్జించడానికి నానా అవస్థలు పడతారు . మల విసర్జన సమయంలో మల ద్వారం చివళ్లు పగిలి తరచూ రక్తం కారుతుంటుంది . మలబద్ధకంతో బాధపడేవారిలో ఎక్కువమంది వంగడానికి , కూర్చోవడానికి , నడవడానికి లేదా లైంగిక సంపర్కానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు . వయసుతో నిమిత్తం లేకుండా ఈ సమస్య ఎవరికైనా రావచ్చు . కొన్ని అధ్యయనాల ప్రకారం నూటికి 16 శాతం మంది పెద్దలు మలబద్ధకం లక్షణాలు , సమస్యలతో బాధపడుతున్నారని తేలింది .60 సంవత్సరాలకు పైబడిన వృద్ధుల్లో మూడింట రెండు వంతుల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి అని అన్నారు . దీర్ఘకాలంగా మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారిలో 30 నుండి 67 శాతం మందికి మలద్వారం టైటికి చొచ్చుకొస్తుంది . మల విసర్జన సమయంలో పెద్దప్రేగు టిష్యూ బైటికి చొచ్చుకొచ్చి తిరిగి లోపలికి వెళ్లకుండా అలాగే టైటే ఉండిపోతుంది . దీనివల్ల మల విసర్జన మరింత కష్టతరం అవుతుంది . సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే టైటికి చొచ్చుకొచ్చిన మలద్వారం టిష్యూ శ్రీణించడం , కణజాలం చచ్చుబడిపోవడం , సరైన రక్త ప్రసరణ లేక కుళ్లిపోవడం లాంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి . వైద్య పరిభాషలో దీన్ని గ్యాంగ్రేస్ అంటారు . దీనికి అత్యవసర శస్త్రచికిత్స చాలా అవసరం అని పేర్కొన్నారు . మలబద్ధకంతో బాధపడేవారు పేగు టిష్యూ బైటికి చొచ్చుకొస్తున్నట్టు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి . మల విసర్జన సమయంలో మల ద్వారం చిట్లి రక్తస్రావం కావడం , తరచూ ఆకస్మికంగా తీవ్రమైన కడుపునొప్పి రావడం , ఊహించని రీతిలో శరీరం బరువు తగ్గిపోవడం , గ్యాస్ , జ్వరం , వాంతులు , వెన్నునొప్పి , మలద్వారం వాపు , మూత్ర విసర్జన స్తంభించిపోవడం లాంటి లక్షణాలను గమనించగానే రోగి వెంటనే సరైన వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం ఉందన్నారు . మలద్వారం వాచిపోయి విపరీతంగా రక్తస్రావం అవుతూ , మూత్ర విసర్జన పూర్తిగా స్తంభించిపోయిన 60 సంవత్సరాల వృద్ధుడిని అతని బంధువులు హైదరాబాద్ మలక్ పేటలోని యశోదా ఆసుపత్రికి తీసుకొచ్చారు . ఆ రోగి దీర్ఘకాలంగా మలబద్దకం సమస్యతో బాధపడుతున్నాడు . 4 నెలలుగా మలద్వారం టైటికి చొచ్చుకొచ్చి వాచిపోయి రక్తస్రావం అవుతున్న స్థితిలో తను విపరీతంగా బరువు తగ్గిపోయాడు . ఆసుపత్రికి వచ్చేనాటికి 3 రోజులనుండి టైటికి చొచ్చుకొచ్చిన మల ద్వారం వల్ల తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ మల విసర్జన చేయలేకపోతున్నాడు . ప్రేగులో మలం పెద్దఎత్తున పిరుకుపోయి మూత్రాశయాన్ని నొక్కేయడంతో మూత్ర విసర్జన కూడా స్తంభించిపోయింది . వైద్య పరీక్షల్లో ఆ రోగికి మలద్వారం తీవ్రస్థాయిలో టైటికి చొచ్చుకొచ్చి వాచినట్టుగా తేలింది . దాదాపు 15 సెంటీమీటర్ల మేర టైటికి చొచ్చుకొచ్చిన మలద్వారం విపరీతంగా వాచిపోయి తీవ్రస్థాయిలో మంటపుడుతోంది . మల విసర్జన చేయలేని స్థితిలో లోపల పేగులో పెద్ద ఎత్తున మలం పేరుకుపోవడంవల్ల మూత్రాశయం బాగా ఒత్తుకుపోయి అతనికి మూత్ర విసర్జన కూడా స్తంభించిపోయింది . అలాంటి స్థితిలో యశోదా ఆసుపత్రి వైద్య బృందం తో ప్రముఖ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటిరాలజిస్ట్ డాక్టర్ ఎమ్.మణిశేఖరన్ అత్యవసర శస్త్ర చికిత్స చేసి , బైటికి చొచ్చుకొచ్చిన మల ద్వారాన్ని కత్తిరించి , కుట్లువేసి రోగి ప్రాణాలను కాపాడారు . యూరాలజిస్ట్ సిస్టోస్కోపీ చేసి బైటికి చొచ్చుకొచ్చిన మల ద్వారం స్థితిని పరిశీలించారు వారం రోజుల తర్వాత ల్యాప్రోస్కోపిక్ విధానంలో మెష్ రెక్టోపెక్సీ చేశారు . తర్వాత 3 నెలలపాటు రోగిని పరిశీలించిన వైద్యులు తర్వాత థెరిచ్ వైర్ ని తొలగించారు . ఆ తర్వాత రోగి ఎలాంటి అనారోగ్యపరమైన సమస్యలూ లేకుండా మల బద్దకం సమస్యనుండి , మూత్ర విసర్జన స్తంభన సమస్యనుండి పూర్తిగా కోలుకున్నాడు అని తెలిపారు . నిపుణులైన యశోదా ఆసుపత్రి వైద్య బృందం సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు , యశోదా ఆసుపత్రి అందిస్తున్న అంతర్జాతీయ స్థాయి అత్యాధునికమైన వైద్య సేవలకు ఈ కేసు కూడా మరో చక్కటి ఉదాహరణ అని అన్నారు . హైదరాబాద్ మలక్ పేట యశోదా ఆసుపత్రిలో మాత్రమే కాక యశోదా అసుపత్రి అన్ని శాఖల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని , నిపుణులైన యశోదా వైద్య బృందం ద్వారా అత్యంత క్లిష్టతరమైన జబ్బులు , వ్యాధులకు కూడా చికిత్స జరుగుతోందని డైరెక్టర్ గోరుకంటి పవన్ యూనిట్ హెడ్ కె. శ్రీనివాసరెడ్డి , శ్రీనివాస్ చిదుర తెలిపారు . మరిన్ని వివరాలకోసం ఈ క్రింది నెంబర్లను ( ఎ.వాసుకిరణ్ రెడ్డిని )9705771230 / 9949998378 సంప్రదించగలరని అన్నారు . ఈ కార్యక్రమంలో పేషంట్ కోటేశ్వరరావు పాల్గొన్నారు.