ఖమ్మం ఖిల్లాలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఆత్మీయ సమ్మెళనం
-జీలానీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వెంకటేష్ కుమార్తె అశ్రిత
ఖమ్మం మే 06 ( జై తెలంగాణ న్యూస్ )
ఖమ్మం ఖిల్లా లో మైనార్టీ మహిళా ఆత్మీయ సమ్మేళనం జిల్లా మైనార్టీ నాయకులూ షేక్ జిలానీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా సప్ని రెడ్డి మాట్లాడుతూ పొంగులేటి శ్రీనన్న ఎలా అయితే ప్రజలకు సేవ చేస్తు అందు బాటులో ఉంటున్నారో అదే విధంగా మా మావయ్యా రఘురాం రెడ్డి మీ అందరికీ ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తారని వారికీ ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.మాజీ కార్పొరేటర్ షౌకత్ ఆలీ మాట్లాడుతూ ప్రజలకూ 6 పథకాల లో అయిదు అమలు చేస్తుందని అవి అందని అర్హులు ఉంటే వారికి అందే విధంగా కృషి చేస్తానని కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అని తెలిపారు.మైనార్టీ నాయకులు షేక్ జిలాని మాట్లాడుతూ దేశంలో హిందు ముస్లిం లు అన్న దమ్ముల కలసి మెలసి ఉండాలంటే ప్రతి ముస్లిం కాంగ్రెస్ కు ఓటు వేసి రఘురామ్ రెడ్డి ని గెలిపించి రాహూల్ గాంధీ ని ప్రధాని గా చేయాలని కోరారు.ఈ కార్య క్రమంలో పాల్గొన్న సప్న రెడ్డి ఆశ్రిత రామసహాయము అర్జున్ రెడ్డి తో పాటు మాజీ కార్పొరేటర్ షౌకత్ అలీ కార్పోరేటర్ అలియా షౌకత్ ఆలీ డివిజన్ ప్రెసిడెంట్ గౌస్ ముక్రమ్ అఫ్సర్ ముకీమ్ గఫూర్ గౌస్ సలీం తదితురులు పాల్గోన్నారు.