నామాకి ఓటు వేస్తే నాకు వేసినట్టే – నామాను భారీ మెజార్టీతో గెలిపించండి – కందాళ

నామాను భారీ మెజార్టీతో గెలిపించండి: కందాళ
– నామాకి ఓటు వేస్తే నాకు వేసినట్టే: కందాళ

ఖమ్మం మే 06 ( జై తెలంగాణ న్యూస్ )

ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం కూసుమంచి మండలం మునిగేపల్లి, నేలపట్ల, కొక్యాతండా గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. మోసపూరిత వాగ్ధానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఈ ఎన్నికల్లో మోసపోకుండా నామాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

గట్టుసింగారం

ఈ పార్లమెంటు ఎన్నికల్లో మీరు నామాకి ఓటు వేస్తే నాకు వేసినట్టేనని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం సోమవారం కూసుమంచి మండలం గట్టుసింగారంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి జిల్లా సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నామా విశేష కృషి చేశారని, ఆయనను మరోసారి గెలిపించి ఢిల్లీకి పంపించాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :