బీఆర్ఎస్ గెలిచే మొట్టమొదటి సీటు ఖమ్మం సీటే: నామా
తల్లాడ మే 06 ( జై తెలంగాణ న్యూస్ )
కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న పథకాలను అమలు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగటానికి ఎలా వస్తున్నారని ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం రాత్రి తల్లాడ మండలం కూర్నవల్లి గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. పథకాలు అమలు చేశాకే ఓట్లు అడగాలన్నారు. తనను గెలిపిస్తే కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిచే మొట్టమొదటి సీటు ఖమ్మం సీటే అన్నారు.