సేవా కార్యక్రమాలతో రుణం తీర్చుకుంటా: నామా
ఖమ్మం మే 06 ( జై తెలంగాణ న్యూస్ )
రైతు బిడ్డ అయిన తననిని ఎంపీగా మరోసారి గెలిపిస్తే మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బలపాల గ్రామస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. తాను అందరివాడినని, అందరికి సేవ చేసే ఆలోచన కలిగిన వ్యక్తిని తాను అన్నారు. బలపాల రైతు బిడ్డగా 25 ఏళ్ల తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమన్నారు.