సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల విసృత ప్రచారం
సత్తుపల్లి మే 06 ( జై తెలంగాణ న్యూస్ )
ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం సత్తుపల్లి మండలం గాంధీనగర్ 14వ వార్డులో నాయకులతో కలిసి కౌన్సిలర్ గుండ్ర రఘు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ. నామాను భారీ మెజారిటీతో మరోమారు గెలిపించాలని అభ్యర్థించారు.